హైదరాబాద్ : శాసనసభ, మండలి సమావేశాలు 11 నుంచి 27వ తేదీ వరకు 14 రోజులు కొనసాగనున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు జానారెడ్డి, చిన్నారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.13న బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa