హైదరాబాద్: నిర్మాణరంగ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలనే తమ నిబద్ధతలో భాగంగా పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌స లిమిటెడ్ చిన్నారుల కోసం ఎడ్యుకేషన్ కేంద్రాలు, డే -కేర్ సెంటర్లను హైదరాబాద్‌లోని రెండు నిర్మాణ ప్రదేశాల వద్ద ఏర్పాటుచేసింది. ఈ సెంటర్లను ప్లాన్ ఇండియా, స్థానిక ఎన్‌జీవో భాగస్వామి మహిళల సహకారంతో ఏర్పాటుచేశారు. ఈ సెంటర్లు ఈ ప్రాంతాలలోని చిన్నారుల విద్య, పౌష్టికాహార, అభివృద్ధి అవసరాలను తీర్చనున్నాయి. ఈ కార్యక్రమం గురించి పిఎన్‌బి హౌసింగ్ మనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌గుప్తా మాట్లాడుతూ అధిక మొత్తంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడంలో నిర్మాణ రంగ పాత్ర కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువైన వేళ ఎక్కువ మందికి ఇది తోడ్పాటును అందిస్తున్నదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa