ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ప్రసంగమంతా అసత్యాలపుట్ట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 12:25 AM

-గవర్నర్‌ చేత అబద్ధాలు చెప్పించిన సర్కార్‌
-ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించడంలో  విఫలం
-డబుల్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాలు  ఎస్సీ, ఎస్టీ
-సబ్‌ ప్లాన్‌ అమలు, బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు ప్రస్తావనే లేదు

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: గవర్నర్‌ చేత టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అబద్ధాలు, అస త్యాలు చెప్పించిందని కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్షం మండిపడింది. గవర్నర్‌ ప్రసంగాన్ని నిరసిస్తూ ఆపార్టీ సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం మీడియాపాయింట్‌ వద్ద సీఎల్పీనేత జానారెడ్డి, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి విపక్షనేత షబ్బీర్‌అలీలు మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం పూర్తిగా నిరాశకు గురిచేసిందని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వ విధివి ధానాలను వివరించే విషయంలో  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు  మూడెక రాల భూమి,  మైనార్టీలు, గిరిజనులకు 12శాతం  రిజర్వేషన్లు, బీసీ సబ్‌ ప్లాన్‌పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు  మూడు ఎకరాల భూమి కోసం  ప్రజలు ఎదురు చూస్తున్నార న్నారు.  మేం కూడా కొత్త ప్రభుత్వం అని ఇప్పటి వరకూ  సహకరిస్తూ వచ్చా మని చెప్పారు.  వారు చేసిన తప్పిదాన్ని వారికి తెలియజేసేందుకే సభ నుంచి  వాకౌట్‌ చేసినట్లు తెలిపారు.  విద్యుత్‌ సరఫరాలో ఏదో ప్రగతి సాధించినట్లుగా  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు పోతోందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులతో ఒక్క యూనిట్‌ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదన్నారు. గత   కాంగ్రెస్‌ ప్రభుత్వ  హయాంలో పూర్తయిన ప్రాజెక్టులే  తప్ప వీళ్లు కొత్తగా సాధించిందేమీ లేదన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఈవిషయాన్ని ఎక్కడా చెప్ప లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా రాషా్ట్ర నికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినట్లుగా గవర్నర్‌ చేత  అబద్ధాలు చెప్పించార న్నారు. దేశంలోని అన్ని రాషా్టల్ర కంటే  తెలంగాణ రాషా్టన్రికే తక్కువగా  పెట్టుబడులు  వస్తున్నాయన్నారు. తాని విషయం చెప్పడం కాదని,  అందరికి అందుబాటులో ఉన్న  మినిస్ట్రీ ఆఫ్‌ కామర్‌‌స వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉన్న లెక్కలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను  31 జిల్లాలు పునర్‌ విభజించి   గొప్ప పని  చేసినట్లు కేసీఆర్‌ చెబుతున్నారని, శాస్త్రీయంగా జిల్లాల విభజన చేయకుండా  అన్ని తుగ్లక్‌ పనులు చేశారని విరుచుకుపడ్డారు.  జిల్లాల విభజనలో ప్రజల మనోభవాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ, ఫీజురీయింబర్‌‌సమెంట్‌ చెల్లించామంటే ఆర్ధికప్రగతి తగ్గిందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారని, మరిప్పుడు  జీడీపీ గ్రోత్‌ రేట్‌ పెరిగిందని గవర్నర్‌ చేత చెప్పించారని, దీనిపై తమకు  అనుమానాలున్నాయన్నారు.  రబీ లో తెలంగాణ రైతులు  బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారని  కేసీఆర్‌ అంటున్నారని, అసలు పండిన పంటలే తక్కువైతే, చెప్పుకుంటుంది ఎక్కువని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.  పండిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగిపంట సగానికిపైగా తగ్గిందని,   తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. దేశంలోనే తెలంగాణలో అన్నదాతలు రికార్డుస్థాయిలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.  ముస్లింలు, గిరిజనులు గత మూడేళ్లుగా  12శాతం రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, అయినా గవర్నర్‌ ప్రసంగంలో దానిపై స్పష్టత కొరవడిందని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో గిరిజన, మైనార్టీల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం వారిని అవమానించడమేనని అన్నారు.  రాష్ట్రంలో రాజకీయఅవినీతి తగ్గిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే అవినీతిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉన్నదని, సాగునీటి ప్రాజెక్టుల్లో దోచుకుంటుంటే, రాజకీయఅవినీతి తగ్గిందనడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనని ఉత్తమ్‌ అన్నారు. మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ దేశంలో అన్నిరంగాల్లో  తెలంగాణ రాష్ట్రం ఆఖరిస్థానంలో ఉంటే, ప్రథమస్థానంలో ఉన్నదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధివకాశాలరంగంలో ఆఖరిస్థానంలో ఉండగా, వైద్యంలో ఆరవస్థానంలో ఉన్నదని చెప్పారు. కేజీటూపీజీ విద్య గురించి అసలు గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించలేదన్న షబ్బీర్‌అలీ, సర్కార్‌తీరు సొంత డబ్బా కొట్టుకున్నట్లుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, బీసీ సబ్‌ప్లాన్‌ గురించి ప్రస్తావన లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే గిరిజన, మైనార్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న  చెప్పి, ఇప్పుడు ఆప్రస్తావనే తీసుకురావడం లేదని షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు. రాజకీయఅవినీతి లేకుండా పారదర్శక పాలన కొనసాగిస్తున్నామని చెబుతున్న సర్కార్‌ అవినీతిపై ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఎందుకు బంద్‌ చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీ-పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క, మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com