ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాషాయ దళంలో పెరుగుతున్న విభేదాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:29 AM

- కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ
-తెలంగాణలో పుంజుకోలేకపోతున్న బిజెపి
-అర్బన్‌ ప్రాంతాలలోను పట్టుకోల్పోతున్న కాషాయ దళం
-కెసిఆర్‌ స్పీడ్‌ను అందుకోలేకపోతున్న నాయకులు
-రాష్ట్ర నాయకత్వం మారినా కానరాని ఫలితాలు
-లక్ష్మణ్‌ నేతృత్వంలో పట్టుపెంచుకునే వ్యూహలు
-ప్రజా క్షే్త్రంలోకి పార్టీని తీసుకెళ్లలేకపోతున్న నేతలు

 మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః గత సార్వత్రిక ఎన్నికలలో  నరేంద్రమోఢీ హవాతో సొంతంగా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలం గాణలో మాత్రం పుంజుకోలేకపోతుంది. గత ఎన్నికలలో టిడిపితో జతకట్టి కేవ లం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకో వాలని ఆదేశించినా రాష్ట్ర నేతలు మాత్రం తమ కార్యాచరణను ప్రకటించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ రోజు రోజుకు బలహీనపడడం, టిడిపి నుండి టిఆర్‌ఎస్‌ లోకి నేతలు జంప్‌ చేస్తుండడంతో ఉన్న పొలిటికల్‌ గ్యాప్‌ను క్యాష్‌ చేసుకోవడంలో కాషాయ దళం విఫలమవుతుందన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సిన అన్ని ముడి సరుకులు అందుబాటులో ఉన్నప్పటికి స్థానిక నాయకత్వం మాత్రం వాటిని వాడుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ తో సమానంగా పోరాడి నప్పటికి ఆ మైలేజిని సొంతం చేసుకోవడంలో మాత్రం బిజెపి నేతలు విఫల మయ్యారు. టిడిపితో పొత్తు ఉండడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పైకి చెబుతున్నప్పటకి వాస్తవానికి పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు దారుణంగా విఫలమవుతున్నారు.సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా గుర్తింపు ఉన్న బిజెపి తెలంగాణలో ఎందుకు ఎదగలే కపోతుందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.
పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతల వైఫల్యం
సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా బిజెపికి జాతీయ స్థాయి లో గుర్తింపు ఉంది. తెలంగాణలో కూడ భారతీయజనతాపార్టీకి బలమైన నాయ కులు ఉన్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా ఒకపుడు పార్టీకి కంచు కోట. రెండు సార్లు కరీంనగర్‌ ఎంపితో పాటు మెట్‌పల్లి, సిరిసిల్ల, కోరుట్ల తది తర అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉండేది. ప్రస్తుత మహరాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పి.మురళీధర్‌రావు వంటి జాతీయ స్థాయి నేతలు ఆ జిల్లాలో ఉన్నారు. అయినప్పటికి పార్టీకి పూర్వవైభవం తీసుకు రావడంలో మాత్రం విఫలమవుతున్నారు. వరంగల్‌ జిల్లాలో మార్తినేని ధర్మా రావు, డా.టి రాజేశ్వరరావు, వేణుగోపాల్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి వంటి కీలకమయిన నేతలు ఉన్నారు. ఇక మ„హబూబ్‌నగర్‌ లో నాగం జనార్దన్‌రెడ్డి, టి ఆచారి, నిజామాబాద్‌లో యెండల లక్ష్మినారాయణ వంటి సీనియర్‌ నేతలు ఉన్నప్పటికి వారి సేవలను వాడుకోవడంలో పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలోకి పార్టీని తీసు కెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణలు కూడ ప్రకటించకపోవడం గమనర్హం. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అవ సరం. దీనిని కూడ రూపొందించడంలో నేతలు విఫలమయ్యారు.
ఎసి రూములకే పరిమితమవుతున్న రాష్ట్ర పార్టీ అగ్రనేతలు
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన బిజెపి ఆ సానుభూతితోనే పాలమూరు అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను ఓడించి ఘనవిజయం సాది ంచింది. దీంతో ఒక్కసారిగా పార్టీపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. పలు వురు అగ్రనేతలు కూడ బిజెపి వైపు చూశారు. అయినప్పటికి గత సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి మెరుగైన ఫలితాలు రాలేదు. దీనికంతటికి ప్రధాన కారణం రాష్ట్ర పార్టీకి సంబందించిన అగ్రనేతలేనని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయాల్సిన కాంగ్రెస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడింది. టిడిపిని టార్గెట్‌ చేసిన టిఆర్‌ఎస్‌ విజయవంతంగా ఆపరేషన్‌ ఆకర్‌‌షను ముగించింది. కేవలం టిడిపికి ఇపుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితులలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తెలంగాణలో ఎదిగేందుకు బిజెపి కి అన్ని అవకాశాలు ఉన్నప్పటికి రాష్ట్ర నేతలు మాత్రం తమకేం పట్టింపు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పదవులను ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లే లక్ష్యంగా అమిత్‌షా టీం వ్యూహలు రచిస్తోంది. టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనీసం పట్టణ ప్రాంతాలోనైనా ఎదƒ గాలనే కార్యాచరణను రూపొందిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటకి కనీసం నాలుగు పార్లమెంటు స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa