ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగని అవినీతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:23 AM

  -ఏసిబికి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
 -10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఇ

 పద్దపల్లి, మేజర్‌న్యూస్‌ : పెద్ద పల్లిలోని శాంతి నగర్‌లో కాల్వశ్రీ రాంపూ ర్‌కు చెందిన ఇరిగేషన్‌ శాఖ ఏఇ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసి బి అధికారులకు శు్ర ƒవారం పట్టుబడ్డారు. వివ రాల్లోకి వెళితే కాల్వ శ్రీరాంపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్‌ ఏఇ సత్యనారాయణ మండ లంలోని పందిల్ల గ్రామంలో దుస్సకుంటకు చేసిన మిషన్‌కాకతీయ పనులకు గాను మంజూరైన రూ. 12. 49లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ దేవేందర్‌ వద్ద లంచం డిమాండ్‌ చేసారు. సదరు అధికారికి మొదటి సారిగా రూ. 8వేలు ఇవ్వగా తిరిగి 10వేలు డిమాండ్‌ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. సంవత్సర కాలంగా తనను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ బిల్లులు మంజూరు చేయకపోవడంతో బాధిత కాంట్రాక్టర్‌ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కాంట్రాక్టర్‌ దేవేందర్‌ పెద్దపల్లిలోని అధికారి నివాసంలో రూ. 10 వేలు లంచం ఇచ్చే సమయంలో  ఏసిబి డిఎస్‌పి సుదర్శన్‌గౌడ్‌ దాడులు నిర్వ హించి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa