ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా మావో'ల దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:19 AM

  -ఎరుపెక్కిన అటవీ ప్రాంతాలు
  -ఆట పాటలతో మహిళా మావోయిస్టుల సంబరాలు
  -అప్రమత్తమైన భద్రతా బలగాలు

హైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌ : మావోయిస్టులు మహిళా కవాతు చేపట్టారు. జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లాకు సమీపంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అడవులు మహిళా కవాతుతో ఎరుపెక్కాయి. అడవిలోని చెట్టుకు పుట్టకు ఎరన్రి జెం డాలు, అడుగడుగునా ఎరన్రి స్థూపాలు, మావోయిస్టుల కరపత్రా లు, బ్యాన …ర్లతో మహిళా దినోత్సవం అడవిలో పండుగలా జరిగింది. ఛత్తీస్‌గడ్‌, మహా రాష్ట్ర కు చెందిన మావోయిస్టు అగ్రనేతలతో పాటు గిరిజనులు, మావోయిస్టు సానుభూతిపరు లు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గ్రీనహంట్‌కు వ్యతిరేకంగా గడ్చిరోలి, చంద్రాపూర్‌, బీజాపూర్‌, జగ్దల్‌పూర్‌ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు కొనసాగినట్లు తెలిసింది. దీంతో పాటు ప్రభుత్వం, భద్రతా దళాల దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి మావోయిస్టులు ప్రజలచేత ద„హ నం చేయించినట్లు సమాచారం.గడ్చిరోలి జిల్లాలోని పలు ప్రాం తాల్లో గ్రామ సభలు నిర్వహించిన మావోయిస్టులు మహిళా చైతన్యం, మావోయిస్టు ఉద్య మంపై ప్రసంగాలు చేసినట్లు సమాచారం. అలాగే అమరులైన మహిళా మావోయిస్టులకు నివాళులర్పిస్తూ ఆటలతో అడవి పల్లె జనాన్ని ఆకట్టు కున్నారు. మహిళా దినోత్సవరం నాడు రాత్రి వరకు గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు సభలు, సమా వేశాలు జరిగినట్లుగా తెలుస్తోంది. జయ శంకర్‌ జిల్లాకు కూతవేటు దూరంలోనే మావోలు భారీ సభలు, ప్లీనరీలతో హోర ెత్తించారు. కాగా, మావోల ప్లీనరీ సమా వేశంపై ఇంటెలిజెన్‌‌స నివేదిక అంద డంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మావోయిస్టుల కోసం తెలం గాణ, మహారాష్ట్ర పోలీసులు భారీ కూం బింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో అట వీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం నిర్విహ ంచడం చర్చనీయాంశంగా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితులు జయశంకర్‌ జిల్లా సరి హద్దుల్లో నెలకొన్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa