ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరుగుతున్న ఉపాధి హామీ లబ్ధిదారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:44 AM

  -తెలంగాణలో గత రెండేళ్లకంటే స్వల్పంగా తగ్గుదల
  -లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌

న్యూఢిల్లీ నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన సవత్సరంలో 32.97 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధిపొందగా 2016- 17లో మార్చి 3వ తేదీ నాటికి ఆ సంఖ్య 37.55 లక్షలకు చేరి ంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 6వ తేదీవరకు 1.45 లక్షల కుటుం బాలకు వందకు మించిన రోజులు పనిదినాలు కల్పించారు.  తెలంగాణలో గత రెండేళ్లకంటే 2016-17లో కొంతమేర తగ్గింది. 2014-15లో 24.63 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పొందగా 2016-17 మార్చి 3 నాటికి ఆ సంఖ్య 23.93 లక్షల కుటుంబాలకే పరిమితమైంది. ఏపీ ఎంపీలు జేసీదివాకర్‌రెడ్డి, కొత్తపల్లిగీతలు లోక్‌సభలో అడిగిన ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేం ద్రసింగ్‌ తోమర్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు.
పోలవరం అంచనా విలువ రూ.16వేల కోట్లు
2010-11 నాటి ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు విలువ రూ.16,010.45 కోట్లని కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యాన్‌ తెలిపారు. గురు వారం లోక్‌సభలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2014 ఏప్రిల్‌ 1 తరువాత జరిగే ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగ నిర్మాణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం 100% భరిస్తుందని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టుకు ఇప్పటివరకూ ఏఐబీపీ కింద రూ.562.47 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 2,931.54 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
రోడ్డుపమ్రాదాల నమోదుకు ఏకరూప విధానం...
కేంద్రం జారీచేసిన ప్రత్యేక ఏకరూప విధానంలోనే రాషా్టల్రు రోడ్డు ప్రమాద సంఘటనలను నమోదు చేయాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.  లోక్‌ సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2017 క్యాలెండర్‌ సంవత్సరం నుంచి అన్ని రాషా్టల్రు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కొత్త నమూనాలోనే ప్రమాదాల ఘటనలను నమోదుచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. దీనివల్ల రోడ్డుపమ్రాదాల సంఖ్యను ఖచ్చితంగా, వేగంగా లెక్కించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
5 ఏళ్లలో రూ.5 వేల కోట్లు
ప్రత్యేక హోదా ఉన్న ఎనిమిది ఈశాన్య రాషా్టల్రకు 2011-16 మధ్యకాలంలో రూ.5,007.78 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామ చందర్రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 8 రాషా్టల్ల్రో అయిదేళ్లకాలంలో 12,537 యూనిట్లు ఏర్పడ్డాయని, 1.11 లక్షల మందికి ఉపాధికల్పన జరిగిందని తెలిపారు. ఈశాన్యరాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అనువెన నిధులను రాయితీపద్ధతుల్లో ఇవ్వడానికి ప్రత్యేకకేటగిరీ కల్పించినట్లు చెప్పారు. అయితే 14వ ఆర్థికసంఘం ప్రత్యేక, సాధారణ కేటగిరీ రాషా్టల్ర మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని చెప్పి సమాంతర పద్ధతిలో నిధులు పంపిణీ చేయాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa