రీమేక్‌స చేసేటప్పుడు నేటివీటీకి తగ్గట్లు స్టోరీలో మార్పులు చేయడం సహజం. అయితే ఇక్కడ హీరో నడుం నొప్పి స్టోరీలో మార్పులకు కారణం అయిందట. కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విదేశాల్లో స్టెప్పులేసేం దుకు సిద్ధమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవలే ఇటలీ ఫై్లట్ ఎక్కేసిన సంగతి తెలిసిందే... తమిళ చిత్రం వీరమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగువారి అభిరుచికి తగ్గట్లు ముస్తాబు చేస్తున్న దర్శకుడు డాలీ.. ఓ విషయంలో మాత్రం హీరో అభిరుచికి తగిన విధంగా స్టోరీని మార్చేశాడట.
అప్పుడప్పుడూ స్టార్ హీరోలు చిత్ర కథా కథనాల విషయంలో జోక్యం చేసుకోవడం సాధారణమే. ఇక పవర్ స్టార్ డైరెక్షన్ డిపార్టె్మంట్‌లో పూర్తిస్థాయిలో మమేకం అవుతాడని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అదే విధంగా కాటమరాయుడు ఇంటర్వెల్ సీన్‌ను తనకు అనుగుణంగా మార్చుకున్నాడట. దీనికి కారణం పవన్ నడుం నొప్పేనని తెలుస్తోంది.
పవన్ నడుం నొప్పికి, సినిమా ఇంటర్వెల్‌కు లింకేంటని మరీ బుర్ర బద్దలుగొట్టుకోకండి. కాటమరాయుడు తమిళ వర్షెన్ ఇంటర్వెల్ సీన్ లో హీరో అజిత్ గాయపడిన తమన్నాను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకుని వెళతాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa