హైదరాబాద్ : నాంపల్లి బజార్గట్లోని హోండా షోరూంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షోరూంలోని పలు బైక్లు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.