ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుపిలో హామీల అమలు కీలకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 01:21 AM

 అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై


 రాజ్యాంగ పరిధిలో రామ మందిర నిర్మాణం


 మేనిఫెస్టోలో బీజేపీ వరాల జల్లుపై ఆశలు


 లోక్‌ కల్యాణ్‌ సంకల్ప ప్తగ్రా నామకరణ


న్యూఢిల్లీ నుంచి  సూర్య ప్రత్యేక ప్రతినిధి :  ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కీలకం కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికీ వరాల జల్లు కురిపించింది. యువత, రైతులే లక్ష్యంగా ఉచిత నజరానాలతో పాటు వివాదాస్పద రామ మందిర నిర్మాణం, త్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలనూ చేర్చింది. యూపీలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ పరిధులకు లోబడి రామ మందిరాన్ని నిర్మిస్తామని, త్రిపుల్‌ తలాక్‌పై ముస్లిం మహిళల అభిప్రాయాలు సేకరించి వాటిని సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు వన్‌ జీబీ డేటా, భారీ స్థాయిలో ఉద్యోగాలు, రైతులకు పంట రుణాల మాఫీ, 24 గంటల విద్యుత్‌ అందిస్తామంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ మేనిఫెస్టోకు లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్‌ అని పేరు పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని అప్పట్లోనే ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల ఎస్పీ, బీఎస్పీ పాలనలో యూపీ అన్నింటా వెనుకపడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అమిత్‌షా చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో 403 స్థానాలకు జరిగాయి. విధానసభ ఎన్నిక మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఢిల్లీవాసులతో సంప్రదించి వారి ఆకాంక్షల మేరకు దీనిని రూపొందించింది. నెరవేర్చగల వాగ్దానాలనే  మేనిఫెస్టోలో చేర్చామని ఆ పార్టీ ప్రకటించింది.  గత విధానసభ ఎన్నికల మాదిరిగానే త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీ సంపూర్ణ రాష్ట్ర హోదాను ఎన్నికల హామీల్లో చేర్చనుంది. అయితే మూడు  మున్సిపల్‌ కార్పొరేషన్లను మళ్లీ విలీన హామీకి అంత ప్రాధాన్యమిచ్చే అవకాశం లేదు.  అయితే యమునా నదిని కాలుష్య రహితంగా చేస్తామనే హామీని మాత్రం ఇచ్చింది.  ఎన్నికల మేనిఫెస్టో ట్రాన్‌‌సయమునా ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యుత్‌, నీటి సరఫరా, రవాణా, పర్యావరణం, యమునా నది తదితర అంశాలపై ఢిల్లీవాసుల అభిప్రాయాలను తెలుసుకుని తదనుగుణంగా మేనిఫెస్టోను కమలదళం రూపొందించింది.  ఇందుకోసం లేఖలతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా ప్రజల నుంచి సూచనలు స్వీకరించింది. ప్రజల సూచనలు స్వీకరించడానికి ఢిల్లీ బీజేపీ కార్యాల యంతో పాటు పలుచోట్ల పోస్‌‌టబాక్సు లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విశ్వవిద్యాల యాలు, ఇతర  విద్యాసంస్థలు శిక్షణా సంస్థలు, మహిళలు, వృద్ధులు, షెడ్యూల్డు కులాలు, గ్రామీణులు, పారిశుధ్య సిబ్బంది, డాక్టర్లు, లాయర్లు, పూర్వాంచలీయులు ఇలా విభిన్న వర్గాలతో బీజేపీ కార్యాలయంతో పాటు ఇతర చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించారు.


యువత, ముస్లింలు, మతగురువులపై కమలం గురి 


విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకుసాగింది. అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 36ను సాధించడానికిగల అన్ని అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకునింది. ఇందులోభాగంగా యువత, ముస్లింలతోపాటు మతపెద్దలను తనవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బహిరంగ సభలు, సభ్యత్వ నమోదుతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అత్యధికంగా 31 స్థానాలను కైవసం చేసుకుంది. మిత్రపక్షం అకాలీదళ్‌ తరపున ఒక అభ్యర్థి విజయం సాధించింది. అయితే మెజారిటీకి నాలుగు స్థానాలు తక్కువగా ఉండడంతో అధికారం చేపట్టలేక పోయింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా అత్యధిక స్థానాలను దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అనుచరులు కలిగిన అన్ని మతాలు, ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులను పొంది. త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  ప్రకటించారు. అధికారంలోకి వస్తే యువకులకు 1 జీబీ ఇంటర్నెట్‌ సదుపాయంతో ఉచితంగా ల్యాప్‌ టాప్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa