బీహార్‌లో కూటమిగా ఏర్పడ్డ బీజేపీ వ్యతిరేకశక్తులు
యుపీలో కలిసిరాని ఎస్సీ, బీఎస్సీలు కలమనాథులను నిలువరించలేకపోయిన ఎస్సీ, కాంగ్రెస్ కూటమి
ఎస్సీ, బీఎస్సీ, కాంగ్రెస్ మహాకూటమిగా పోటీ చేసి
ఉంటే ఫలితం మరో విధంగా ఉండేవి
ఢిల్లీ, మేజర్‌న్యూస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఓటమికి, ఉత్తరప్రదేశ్‌లో ఆపార్టీ ఏకపక్ష విజయానికి ప్రధాన కారణం ఒకే ఒక్కటని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలోని యునైటేడ్ జనతాదళ్, లాలుప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌పార్టీలు జతకట్టి ఎన్నికల గోదాలోకి దిగి విజయాన్ని సాధించగా, ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీపార్టీ, కాంగ్రెస్‌పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలబరిలోకి దిగినా, కమలనాథులను నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అయితే ఎస్సీ, కాంగ్రెస్‌తోపాటు బహుజన సమాజ్‌పార్టీ కూడా జతకట్టి మహాకూటమిగా ఏర్పడి, బీజేపీతో తలపడి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండి, ఉండేదంటున్నారు. బీహార్ ఫలితమే ఉత్తరప్రదేశ్‌లోను పునారవృత్తమయి ఉండేదని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎస్సీ, కాంగ్రెస్ కూటమి, బీఎస్సీలు సాధించిన సీట్లు, బీజేపీకి దరిదాపుల్లో లేకపోయినప్పటికీ, ఎస్సీ, కాంగ్రెస్ కూటమిగా బీఎస్సీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓటమికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. ఎస్సీ, బీఎస్సీలు ఏకమై కూటమిగా పోటీ చేసి ఉంటే ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఈకూటమికే ఓటు వేసి ఉండేవారంటున్నారు. అలాగే దళిత, బడుగు, బలహీనవర్గాలు, యాదవులు సైతం ఎస్సీ, బీఎస్పీ కూటమికి దన్నుగా నిలిచేవారన్నారు. దీంతో దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న బీజేపీ కల సాకరమయి ఉండేది కాదంటున్నారు. అయితే బీజేపీ విజయానికి, ఎస్సీ, బీఎస్సీల పరాభవానికి పట్టువిడుపులు లేకుండా రాజకీయాలు నెరపడం కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు. ఎగ్జిట్‌పోల్‌స అంచనాలు వెలువడినతరువాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని, అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశాలు లేవని అన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్‌పోల్‌స అంచనాలు వెలువడిన వెంటనే అఖిలేష్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకుండా అవసరమైతే బీఎస్పీతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని ప్రకటించి పరోక్షంగా బీఎస్సీకి స్నేహాస్తాన్ని అందించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయవతి మాత్రం సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఎన్నికల అనంతరమే ఈపరిస్థితి ఉంటే, ఎన్నికల ముందు ఎస్పీ, బీఎస్పీలు కలిసి కూటమిగా పోటీచేసే అవకాశాలెంతమాత్రం కనిపించడం లేదంటున్నారు. ఎస్పీ, బీఎస్పీల మధ్యనున్న బద్ద రాజకీయవైరమే బీజేపీ కలిసొచ్చి ఉత్తరప్రదేశ్‌లో 47 ఏళ్ల అనంతర ఫలితాలు పునారవృత్తమయ్యాయని చెబుతున్నారు. 1980లో కాంగ్రెస్‌పార్టీ 309 స్థానాలు గెల్చుకుని కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగా,తాజా ఎన్నికల్లో బీజేపీ అదే ఫీట్‌ను రిపీట్ చేసిందన్నారు.
రాజకీయవైరాన్ని వీడి ఎస్పీ, బీఎస్సీలు బీహార్‌లో మాదిరిగా యునైటేడ్ జనతాదళ్, రాష్ట్రీయజనతాదళ్ మాదిరిగా కలిసి ఎన్నికలకు వెళ్లి ఉంటే, ఈ ఘోర పరాభవం తప్పి ఉండేదంటున్నారు. బీహార్‌లో యునైటేడ్ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ మధ్య కూడా రాజకీయవైరమున్నప్పటికీ, ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలన్న ఏకైకలక్ష్యంతో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల గోదాలోకి దిగి, అనుకున్న ఫలితాన్ని సాధించి, అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa