హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి : శుక్రవారం అసెం బ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారనే ఆరోపణపై టీడీీ పకి చెందిన ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య లను సస్పెండ్ చేసిన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందించారు. గవర్నర్ మాట్లాడుతుంటే విచక్షణారహితంగా అరవడం అవసరమా? అని సీఎం ప్రశ్నించారు. శాసనసభ నిబంధనల ప్రకారమే సభను నడిపిస్తున్నట్టు స్పష్టంచేశారు. రాజకీయ నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు తమ భవిష్యత్తు పాడుచేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 60 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు వచ్చిన ఉద్యోగాలు ఎన్నో చూడాలని, ఇవాళ ఉద్యోగాల కోసం నిరుద్యోగులను ప్రేరేపించడం ఎంతవరకు సబబని విపక్షాలను ప్రశ్నించారు. తమ పాలనలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామనీ, నిరుద్యోగులు సహనంగా ఉండాలని కోరారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తాము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప అవాస్తవాలు చెప్పడంలేదన్నారు. ప్రజాస్వామిక విలువలకు, నిబంధనలకు లోబడి సభ జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగానే తాము వ్యవహరిస్తామన్నారు. ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకోసం ఎంత సమయమైనా కేటాయిస్తామని ప్రకటించారు. సభ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దెబ్బతీయ నీయ మన్నారు.
ప్రతిరోజూ ఎనర్జీడేనే : ఏ పార్టీవారైనా శాసన సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం తాము ఇస్తున్నా మని సీఎం స్పష్టంచేశారు. నియోజక వర్గాలకు అభివృద్ధి నిధులు రూ.3కోట్లు అందించామ న్నారు.మిషన్ కాకతీయను.. కమీషను కాకతీయ అంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారనీ, ఏ పనిచేసినా అవినీతి జరుగుతుందటారు.. రుజు వులు మాత్రం చూపడంలేదని మండిపడ్డారు. విద్యుత్ అంశంలో తమ పాలనలో తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నెలకొన్న విద్యుత్ దుస్థితి తొలగిపోయిందన్నారు. కోతలు లేని నిరంతర విద్యుత్‌ను ప్రజలకు అందించగలిగామన్నారు. విద్యుత్ అధికారులు సమర్థంగా పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉండేదని, ఇప్పుడు మాత్రం ప్రతిరోజు ఎనర్జీడేగా నడుస్తోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa