న్యూఢిల్లీ నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఉత్తర్‌ప్రదేశ్ దేశరాజకీయాలకు ఆయువుపట్టు లాంటిది. లోక్‌సభ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రం ప్రతి సార్వత్రిక ఎన్నికలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రధానమం త్రులుగా బాధ్యతలు నిర్వహించిన జవహర్‌లాల్‌నెహ్రూ, లాల్‌బహుదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్‌సింగ్, రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి తదితరులు ఈ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆ రాష్ట్రంలోని వారణాసి నుంచి ప్రాతిని ద్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రాయ బరేలీ నుంచి కాంగ్రెస్ అధి నేత్రి సోనియా, అమేథీ నుంచి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ఎంపీలుగా ఉన్నారు.
హస్తానికి ఏమైంది : 1980 తరువాత ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. మండల్ ఉద్యమం బీసీల్లో స్ఫూర్తిని తీసుకురావడంతో రాజకీయ చెతన్యం ఏర్పడింది. తరువాతి కాలంలో బీసీ నేత ములాయంసింగ్ యాదవ్ నెలకొల్పిన సమాజ్‌వాదీపార్టీ ఓబీసీల్లో ప్రధాన వర్గమైన యాదవులతోపాటు ముస్లింలకు పెద్దదిక్కుగా మారింది. అగ్రవర్ణాలు భాజపాకు మొగ్గు చూపడంతో పాటు దళితులు బీఎస్పీ వైపు మళ్లారు. దీంతో కాంగ్రెస్‌కు బలమైన సామాజికవర్గం అండ లేకుండాపోయింది.
రాహుల్‌గాంధీతో తిరోగమనం : రాహుల్‌గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరోగమన దిశకు చేరుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం కోసం ప్రముఖ రాజకీయ నిపుణుడు ప్రశాంత్‌కిశోర్ సేవలను ఉపయోగించుకున్నా లాభం లేకపోయింది. ఖాట్‌సభలు నిర్వహించినా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయింది. తాజా ఎన్నికల్లో అధికార ఎస్పీతో చేతులు కలపడం ఘోర పరాభవానికి దారితీసింది. కేవలం 7 సీట్లను గెల్చుకోవడం గమనార్హం. 2012 ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడి 28 స్థానాలను గెలుచుకున్న తాజాగా ఎస్పీతో పొత్తుపెట్టుకున్నా కనీసం డబుల్‌డిజిట్‌కు కూడా చేరకపోవడం గమనార్హం. 1980లో 309 సీట్లతో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఎన్నికల్లో తక్కువస్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
ఓటమికి పలు కారణాలు :రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలతో చీలిపోయి ఉంది. రాష్ట్రంలో పేరున్న కాంగ్రెస్ నేతలు లేరు. ఈ మధ్య కాలంలోనే పార్టీలో సీని యర్ నేత రీటా బహుగుణ పార్టీని వీడి భాజపాలో చేరారు. కీలకమైన నేతలు లేకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా నైరాశ్యానికి గురయ్యాయి. దాదాపు పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ యూపీ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదు. కనీసం అమేధీ, రాయబరేలీలో కూడా పెద్దఎత్తున పారిశ్రామికప్రగతికి అవకాశాలున్నా చర్యలు తీసుకోలేదు. రాయబరేలిలో రైలుపెట్టెల కర్మాగారం కూడా ఎక్కువమందికి ఉపాధి కల్పించలేదు. ఈ ఎన్నికల్లో కనీసం ఒంటరిగానే పోటీ చేసినా కొన్నిం టిలోనైనా ఆధిక్యం ప్రదర్శించే అవకాశం దక్కేది. ఎస్పీతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించలేదు. దీంతో ఘోరంగా ఓటమి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa