ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకృతులపై శరవేగంగా కసరత్తు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 01:30 AM

 సంస్కృతి+చరి్త్ర అంశాల మేళవింపుతో అమరావతి నిర్మాణం


 ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలకు సంబంధించి ఇప్పటి వరకు పరిశోధించి సేకరించిన చిహ్నాలు, ఆధారాలు, ఆకృతులను అంశాలవారీగా క్రోడీకరించి వాటిని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ సారధ్యంలోని నిష్ణాతుల కమిటీ నిర్ణయించింది. కుడ్యాలు, కూడళ్లు, భవంతులు, ప్రాకారాల నమూనాలను వేర్వేరుగా వర్గీకరించి తుది ఆకృతుల రూపకల్పనలో పొందుపర్చాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. అమరావతి రూపకల్పన కోసం ఏర్పాటైన ఈ కమిటీ శనివారం విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో మలి విడత సమావేశాన్ని నిర్వహించింది. కమిటీలోని రెండు బృందాలు తిరుపతి, న్యూఢిల్లీ, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాలలో పర్యటించి ఇప్పటివరకు అధ్యయనం చేసిన అంశాలపై ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లు ఇచ్చారు.  రహదారి కూడళ్లు, స్వాగత ద్వారాలు, ప్రభుత్వ భవంతులు, ప్రాకారాలు, పచ్చిక బయళ్లు, వాటర్‌ ఫౌంటేన్లు, భవంతుల సీలింగ్‌, స్థంభాలు, కుఢ్యాలు, ఉద్యానవనాలు ఎలా ఉండాలనే అంశంపై ఈ కమిటీ సుదీర్ఘ సమాలోచన జరిపింది. అమరావతి నగర నిర్మాణానికి ఆకృతులు సిద్ధం చేస్తున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రాథమికంగా కొన్ని కాన్సెప్షనల్‌ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని, అందులో నగర స్వభావం ఎలావుండాలో స్థూలంగా వివరించిందని సమావేశానికి అధ్యక్షత వహించిన పరకాల ప్రభాకర్‌ చెప్పారు. రహదారులు, జల మార్గాలు ఎక్కడ, ఎలా వుండాలో చెప్పారని, ప్రాథమిక ఆకృతుల్లో మన సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు కొన్నింటిని వారు ఇప్పటికే తీసుకున్నారని తెలిపారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ త్వరలో సవివర ప్రణాళికతో కూడిన ఆకృతులను ప్రభుత్వానికి అందించనుందని, ఈలోపు సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలకు సంబంధించిన అన్ని అంశాలు ఎక్కడెక్కడ, ఎలా నిక్షిప్తం చేయాలో ఒక నిర్ధిష్ట రూపానికి తీసుకురావాలని ప్రభాకర్‌ సూచించారు. తుది ఆకృతులు అందించేందుకు ముందే నిష్ణాతుల కమిటీతో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు సమావేశం అవ్వనున్నారని వివరించారు. ఈలోగా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు కమిటీ తనకు అప్పగించిన బాధ్యతలపై కసరత్తు పూర్తి చేయాలన్నారు. కట్టడాల ఆకృతులలో మనదైన శైలి కచ్చితంగా ప్రస్పుటమవ్వాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనగా స్పష్టంచేశారు. గతంలో నిర్మితమైన నగరాలు ఏదో ఒక థీమ్‌ తీసుకుని నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయని, చరిత్రలో మొదటిసారి గత వైభవాన్ని, సంస్కృతి, వారసత్వ సంపదల మేళవింపుతో రాజధాని  నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్‌ నగరాన్ని నిర్మించిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఈసారి ఆ తరహా నగరం కాకుండా సంప్రదాయాన్ని జోడించి అత్యాధునిక నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నారని చెప్పారు. ఆకృతులన్నీ అత్యద్భుతంగా ఉండాలని లేదని, కొన్నిసార్లు చిన్నపాటి అలంకరణలే గొప్పగా అమరుతాయని అన్నారు. నిర్మాణంలో సాధ్యమయ్యే ఆలోచనలు, సూచనలనే పరిగణనలోకి తీసుకుందామని ప్రతిపాదించారు. రోడ్డు,  జంక్షన్‌ వంటి  పరభాషా  ప్రయోగాలు వదిలి వీధి, బాట, మార్గము తరహా అచ్చ తెలుగు పేర్లు వాడదామని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరిగొండ వెంగమాంబ, మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్ధండులను గుర్తించి వారి స్మారకార్ధం తపాల బిళ్లలను త్వరలో తీసుకురాబోతోందని గుర్తుచేస్తూ, చరిత్రలో నమోదైన మహనీయుల స్మృతుల్ని మన రాజధానిలో పదిలపరచుకోవాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 6,7 తేదీలలో తిరుమల తిరుపతి మ్యూజియాన్ని సందర్శించి అక్కడున్న విశిష్టమైన నాణేలపై అధ్యయనం చేశామని ఎస్వీ మ్యూజియం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రంగనాయకులు తెలిపారు. అరుదైన జాతి వృక్షాలను అమరావతిలో పెంచవలసిన అవసరం వుందని ఎస్వీ యూనివర్శిటీ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ క్రాంతి  చౌదరి చెప్పారు. ప్రస్తుతం అశోకచెట్లుగా మనం భావించే వృక్షాలు అసలైనవి కావని, కాకపోతే ఈ తరహా వృక్షాలు విరివిగా నాటడం వలన ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తాయని తెలిపారు. కర్నూలులో దొరికిన పల్లవ కాపర్‌ ప్లేట్‌ టీటీడీ మ్యూజియంలో లభ్యంగా వుందని, పల్లవులు ఆంధ్ర ప్రాంతంలో ధాన్యకటకం కేంద్రంగా పాలించారనడానికి ఇదే గొప్ప ఆధారమని తెలిపారు. కాకతీయ, చోళ, తెలుగు చోడ, విజయనగరం చక్రవర్తుల కాలం నాటి శిల్ప ఆకృతులు అందుబాటులో ఉన్నాయన్నారు. శతాబ్దాల నాటి నాణేలను సేకరించి వాటిల్లో ఉన్న ఆకృతులను క్రోడీకరించే ప్రయత్నంలో వున్నామని ఆర్కియాలజిస్టు కేవీ రావు చెప్పారు. తిరుపతి ఎస్వీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలో అవసరమైన కొన్ని వారసత్వ చిహ్నాల ఆకృతులను తీసుకుని వాటితో కొన్ని  ఆకృతులను రూపొందిస్తున్నామని సినీ కళా దర్శకుడు ఆనందసాయి తెలిపారు. తిరుమలలో వున్న 18 అడుగుల మెటల్‌ దీప స్థంభాన్ని రాజధాని నిర్మాణంలో ఎక్కడో ఒకచోట చిహ్నంగా ఉంచాలని డిజైనర్‌ వాసుకీ బాలసుబ్రమణియన్‌ సూచించారు. ఢిల్లీలోని నార్‌‌త బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌, రాష్టప్రతి భవన్‌, నేషనల్‌ మ్యూజియం అన్నీ పరిశీలించి కొన్ని సాంస్కృతిక అంశాలను తీసుకున్నామని చరిత్రకారుడు శివనాగిరెడ్డి తెలిపారు. గతం లేకుండా మనం జీవించలేమని, అలాగే, గతంలోనే మనం జీవించజాలమని ప్రముఖ అర్కియాలజిస్‌‌ట ప్రొఫెసర్‌ పద్దయ్య వ్యాఖ్యానించారు. అరసవిల్లి, శ్రీకూర్మం, ముఖలింగం, రావివలస, మిలియాపుట్టి తదితర సంస్కృతి, శిల్పరీతి, సవరల శైలిని రాజధానిలో ఎక్కడో అక్కడ నిక్షిప్తం చేయాలని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌ కోరారు. అవుట్‌ డోర్‌ స్కల్పర్‌, లాబీ ఆర్‌‌టలపై చరిత్రకారుడు సాయి పాపినేని ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో ఇంకా అమరావతి హెరిటేజ్‌ సిటీ అడ్వయిజర్‌  అమరేశ్వర్‌ గల్లా, నార్మన్‌ ఫోస్టర్‌‌స ప్లస్‌ పార్టనర్‌‌స అసోసియేట్‌ ఆర్కిటెక్‌‌ట హర్‌‌ష థాపర్‌ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa