హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రజలంతా ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పరస్పరం శ్రేయస్సు కోరేవిధంగా సమాజం శాంతియుతంగా ఉండేలా హోలీని జరుపుకోవాలన్నారు. హోలీ ద్వారా రంగులు చల్లుకోవడంతో జాతీయతాభావం నెలకొనడంతోపాటు మనలో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. సురక్షితమైన రంగులతో సంతోషంగా పండుగను నిర్వహించుకోవాలని నరసింహన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa