మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదుర్ మండలం చిన్నముప్పారం గ్రామంలో నిర్వహించిన 'తండా బాట' కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దతండా, భూక్య తండా, రేగడి తండాలలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.