ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 08:57 AM

హోలీ వేడుకలతో తెలంగాణ పరవశించిపోతుంది. జిల్లాల్లో ప్రజలు ఉదయం నుంచే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కలర్‌ ఫుల్‌  ఫెస్టివల్ ను ఎంజాయ్‌  చేస్తున్నరు.ఆదిలాబాద్  జిల్లా ఉట్నూర్ లో గిరిజన సాంప్రదాయాల్లో హోలీ వేడుకలను ప్రారంభించారు. మోదుగుపూలకు ప్రత్యేక పూజలు చేసి హోలీవేడుకల్లో గిరిజనులు పాల్గొన్నరు. వ‌రంగ‌ల్ లో ఎనుమాముల వ్య‌వసాయ మార్కెట్ యార్డులో కార్మికులు, హమాలీలు, వ్యాపారులు రంగులు పూసుకొని సంబురాలు చేసుకున్నారు.  ఒక‌రి పై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ వేడుక‌ల‌ను జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముందస్తు హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. జాగృతి సారధ్యంలో గోదావరిఖనిలో కామదహన కార్యక్రమం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa