ఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాతా సుందరి కాలేజ్ సమీపంలోని ఓ ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి.తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. 30 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa