సరైన విజయం దక్కి రెండేళ్లయ్యింది. అందుకే నగరం చిత్రానికి వస్తున్న స్పందన చూసి ఆనందంతో ఏడుపొచ్చేసిందన్నారు సందీప్ కిషన్. ఆయన కథానాయకుడిగా నటించిన నగరం ఇటీవలే విడుద లైంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. శ్రీ, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను కథానాయకుడ్ని కాదు. నాదో పాత్ర మాత్రమే. ఇది దర్శకుడి చిత్రం. పట్టు సడలని స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు. సెట్‌సలో శ్రీ, లోకేష్, ఎస్.ఆర్.ప్రభు నుంచి చాలా నేర్చుకొన్నా. ఈరోజు నువ్వు ఒక వ్యక్తి కోసం నిలబడితే రేపు నీ కోసం ఎవరయినా నిలబడతారని దర్శకుడు చెప్పిన అంశం ఆకట్టుకుం టోందన్నారు. నా నెక్‌స్టచిత్రం నక్షత్రం, ప్రస్థానం. దర్శకుడు మాట్లాడుతూ మా ప్రయత్నానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని అనుకోలేదు. దర్శకుడిగా నా తొలి చిత్రమిదే. ఇలాంటి మంచి చిత్రాలే భవిష్యత్తులోనూ రూపొందించడానికి మరింత కష్టపడతానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa