ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం దుకాణాల ఏర్పాటుకిక చెక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 12:55 AM

 ప్రస్తుతమున్న వాటిని మార్చి 31లోగా తొలగించాలన్న సుప్రీం  రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది రహదారుల వెంట వేలాది మద్యం దుకాణాలు, బార్లు  సుప్రీం ఆదేశాలతో తొలగించేందుకు ఎకై్సజ్‌శాఖ అధికారుల కసరత్తు   బెల్టు షాపులను అరికట్టాలని కోరుతున్న ప్రజాసంఘాలు 


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ప్రధాన రహదారులకు ఆనుకుని రెండు తెలుగు రాషా్టల్ల్రో ఏర్పాటు చేసిన  మద్యం దుకాణాలను వెంటనే తొలగించి, అరకిమీ దూరంగా  ఏర్పాటు చేయాలన్న  సుప్రీం ఆదేశాలను అమలు చేసేం దుకు  ఎకై ్సజ్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తే  రెండు రాషా్టల్ల్రోని  వేలా ది మద్యంషాపులు, బార్లు,  రోడ్లకు అరకిలోమీటరు దూ రం జరగనున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న   మద్యం దుకాణాలకు,  బార్‌లను ఎకై ్సజ్‌ చట్టంలో మార్పులు చేసి, అరకిమీ  దూరంగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల  ఆదేశిం చింది. 2017 మార్చి 31లోగా జాతీయ,  రాష్ట్ర రహదారు లను అనుకుని ఉన్న మద్యం దుకాణాలను, బార్లను అరకిమీ దూరంలో ఏర్పాటు చేసుకునే విధంగా గడువు విధించింది.   గడువులోగా ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన  మద్యం దుకాణాలను, బార్లను తొలగించాల్సిందే నని అత్యున్నత న్యాయస్థానం విస్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎకై ్సజ్‌శాఖలో కదలిక వచ్చింది. జాతీ య, రాష్ట్ర రహదారులపై రెండు తెలుగు రాషా్టల్ల్రో ఏర్పాటు చేసిన  మద్యం షాపులను తొలగించడానికి  ఎకై్సజ్‌శాఖ అధికారులు  కసరత్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పరిధిలోని  మచిలీపట్నం, విజయవాడ ఎకై ్సజ్‌ „సూపరిండెంట్‌ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే  156 బార్‌ , 336 మద్యం దుకాణాలున్నట్లు అధికా రులు లెక్క తేల్చారు.  మచిలీపట్నం ఎకై ్సజ్‌ సూపరిం టెండెంట్‌తో  పాటు విజయవాడ ఎకై ్సజ్‌ సూపరింటెం డెంట్‌ పరిధిలో మొత్తం 336 మద్యం షాపులు,  158 బార్‌ షాపులు ఉన్నాయని అధికారులు చెప్పారు.  వీటిలో మచిలీపట్నం-విజయవాడ ఇ.ఎస్‌.ల పరిధిలో మొత్తం 275 మద్యంషాపులు , 105 బార్లు హైవేలకు 500 మీటర్ల లోపే  ఉన్నట్టు గుర్తించామన్నారు. త్వరలోనే  వాటిని తొల గించాలని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు  నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 


 తెలుగు రాషా్టల్ల్రో  పలు మద్యం దుకాణాలకు  ఈ ఏడాది  జూన్‌ 30 వరకు అమ్మకాలకు లైసెన్సులు ఉన్నా యి. కొత్త రూల్‌‌స ప్రకారం ఈనెల 31కే షాపులను తొల గించాల్సి రావడంతో,  లీజు వసూళ్లపై ఎకై ్సజ్‌శాఖ కొంత సడలింపు ఇస్తోంది. సాధారణంగా ఏడాదికి మూడు క్వార్టర్లు చొప్పున మద్యం దుకాణాల యజమానులనుంచి  లీజు వసూళ్లు జరుగుతాయి. ప్రతి నాలుగు నెలలకోసారి శ్లాబ్‌ ల వారీగా ఈ వసూళ్లు చేస్తారు. దానిలో భాగంగా మార్చి నుంచి జూన్‌ వరకు ఆఖరి క్వార్టర్‌ లో హైవేలకు సమీపంలో ఉన్న షాపులకు  మార్చి నెల ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే షాపుల తరలింపు  అనేది ఒక ఫార్‌‌సగా మారిపోయే అవ …కాశం ఉందంటున్నాయి ప్రజాసంఘాలు. రాష్ట్ర ప్రభు త్వాలు ఇప్పటికైనా రహదారుల వెంట మందు దుకాణా లను వెంటనే  తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదం టే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే లీజు సంవత్సరం పూర్తయ్యే జూన్‌ 30 వరకు లైసెన్‌‌స లు కొనసాగించేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును తెలుగు  రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. రెండు తెలుగు రాషా్టల్రు చేస్తున్న  విన్నపాలను సుప్రీం  పరిగణనలోకి తీసుకుంటే జూన్‌ వరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మద్యం దుకాణాలు కొనసాగే అవకాశాలున్నాయి. లేక పోతే   ఏప్రిల్‌ మొదటి నాటికి  హైవేల పక్కనున్న మద్యం దుకాణాలను సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా అరకి లోమీటరు లోపలికి  తరలించాల్సిందే. 


సుప్రీంకోర్టు ఆదేశాలను మహిళా,ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలు, బార్లను తొలగించ డమే  కాకుండా, గ్రామాల్లో, బస్తీల్లో  పుట్లగొడుగుల్లా వెలు స్తున్న  బెల్టుషాపులను  కూడా తొలగించే విధంగా ఆదేశా లు జారీ చేయాలని కోరుతున్నారు.  బెల్‌‌టషాపులతో గ్రామా ల్లో ప్రజలు మద్యానికి బానిసలై తమ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అధికారంలోకి రాకముందు అన్ని రాజకీయ పక్షా లు బెల్‌‌టషాపులను మూసి వేస్తామని హామీలు ఇస్తున్నా యని, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు మద్యం అమ్మకాలను విపరీతం గా ప్రోత్సాహిస్తున్నాయని మహిళాసంఘాల నేతలు మండిపడుతున్నారు. రెండు తెలుగు రాషా్టల్ల్రోని పాలకు లు బెల్‌‌టషాపులను యథేచ్చగా స్రోత్సాహిస్తూ, ప్రజల ఆరో గ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa