ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గిన బంగారం దిగుమతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 12:57 AM

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల చలామణీని రద్దు చేస్తూ క్రిత…ం సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనేక రంగాలపై ప్రభావం చూపిన విషయం విదితమే. ఆ ప్రభావం బంగారంపైనా పడింది. నవంబర్‌ 8 తరువాత బంగారానికి డిమాండ్‌ తగ్గడంతో పాటు డిసెంబర్‌, జనవరి మధ్య కాలంలో దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. నవంబర్‌ నెలలో 119.2 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతి డిసెంబర్‌ నెలలో 54.1 టన్నులకు పడిపోయింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలోనూ మరింత తగ్గి 53.2 టన్నులకు పరిమి తమైంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 43 శాతం బంగారం దిగుమతులు పడి పోయాయి. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో భారీగా నోట్ల కొరత ఏర్పడిన సంగతి విదితమే. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం, పెద్ద నోట్ల చలామణీ రద్దు తరువాత పాత నోట్లను వదిలించుకునేందుకు ప్రజలు భారీగా బంగారం కొనుగోలుకు మొగ్గు చూపారు. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో దిగుమతులు పెరిగాయి. ఆ తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో డిసెంబర్‌, జనవరి నెలల్లో దిగుమతుల్లో భారీ క్షీణత నమోదైందని తెలిపింది. దేశంలో 80 శాతం మంది బంగారు ఆభరణాలను నగదు ద్వారానే కొనుగోలు చేస్తారు. నవంబర్‌ 8 తరువాత అలా కొనుగోలు చేసే వారి సం్య కూడా క్రమంగా పడిపోయింది. బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో 892.2 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, ప్రస్తుతం ఏప్రిల్‌, జనవరి మధ్య కాలంలో అది 546 టన్నులకు పరిమితమైంది. ఇక 2015-16 సంవత్సరంలో అత్యధికంగా 986 టన్నుల బంగారం దిగుమతి అయింది.


దుబాయిలో తగ్గిన బంగారం ధర


దుబాయి: ప్రపంచ మార్కెట్లన్ని బంగారంతో ముడిపడి ఉన్నాయి. బంగారం ధర పెరిగితే మార్కెట్ల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకవేళ తగ్గితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. అటువంటి బంగారం ధర దుబాయి మార్కెట్‌లో 115.20 దరమ్‌‌స తగ్గింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అది రూ. 2018 అన్నమాట. గడచిన నాలుగు నెలల్లో బంగారం ధర ఇంత తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని ఆ వర్గాలు సూచిస్తున్నాయి. డాలర్‌ మారకం విలువ 0.1 శాతం తగ్గినందు వల్లే బంగారం ధర తగ్గిందని దుబాయ్‌ ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించాయి. ఇది ఆసియా దేశాల్లోని బంగారం మార్కెట్లకు లాభం చేకూర్చగలదని దుబాయ్‌ గోల్‌‌డ ట్రేడ్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa