ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమం మనటివి సీఈవో శైలేశ్ రెడ్డి.
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ప్రొబెషనరి ఆఫీసర్‌స ఉద్యోగ పరీక్షలపై మనటివి స్టూడియెాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సాఫ్‌ట నెట్-మనటివి సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. పీవో ఉద్యోగ పరీక్షలపై పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఏమైనా అనుమానాలుంటే ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వార నివృత్తి చేసుకోవాలని సీఈవో సూచించారు.
దేశవ్యాప్తంగా 2,403 పీవోల ఉద్యోగాల భర్తిలో భాగంగా ఏప్రిల్ 29,30 మే 06,07 తేదిల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తుందని సీఈవో తెలిపారు. ఈ పరీక్షలకు హజరయ్యే అభ్యర్థులకు అనుమానాలుంటే ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు మనటివి లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం(లైవ్ షో) ఉంటుదని, ఆ కార్యక్రమంలో అనుభవం కల్గిన నిపుణులు మధుకిరణ్ చే అనుమానాలు, సందేహలను నివృత్తిచేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు సంప్రదిచాల్సిన ఫోన్ నెంబర్లు 040 23551989/3473, టోల్ ఫ్రి నెం. 18004254038/39గా గుర్తుంచుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.
14వ తేదీన అవగాహన కార్యక్రమం: కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగాలపై ఈ నెల 14వ తేదీన మనటివిలో అవగాహన కార్యక్రమం ప్రసారం చేస్తున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా ప్రిఫేర్ అవ్వాలనే అంశాలపై ఈ నెల 14వ తేది మంగళవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మూడు గంటల పాటు ప్రసార కార్యక్రమం ఉంటుందన్నారు.
రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ ల పై అవగాహన కార్యక్రమం ప్రసారమౌతుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa