హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌదరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మొదటిసారి ఈ-గవర్నెన్స్‌పై సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు. మెరుగైన పౌరసేవల కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని స్పష్టం చేశారు. అనంతరం కేంద్రమంత్రి సీఆర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకరించిందని తెలిపారు. ఇలాంటి గొప్ప సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అభినందనలు చెప్పారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన అందాలన్నారు. ప్రజలకు చేరువయ్యే పథకాలు రావాలని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. లక్షకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని స్పష్టం చేశారు. మొబైల్ వాడకంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa