వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బస్సు యాత్రపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఏం సాధించారని, ఇంకా ఎవరు నమ్ముతారని బస్సుయాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరని మహేందర్‌రెడ్డి అన్నారు. పరిగిలోని శ్రీ వెంటేశ్వర స్వామి ఆలయంలో మహేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో కనిపించే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ మునిగే పార్టీ అని గతంలో బుద్ది చెప్పిన తరహాలో ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఉద్యమనేతగా సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారని మహేందర్ రెడ్డి తెలిపారు. ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి చొప్పున రెండు పంటలకు దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితి రైతును రాజుగా చేస్తుందన్నారు. రైతులు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఊహించిందా అని ప్రశ్నించారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్లున్నాయన్నారు. మాట నిలబెట్టు కోవడం, ధైర్యంగా ముందుకుసాగడం సీఎం కేసీఆర్ కే సాధ్యమని మహేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. పరిగి నియోజకవర్గంలో హరీశ్వర్‌రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సీఎం అవుతానని కలలు కంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa