కరీంనగర్ : త్వరలో 1.61 లక్షల మంది రైతు సమితి సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు మంత్రి పోచారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి యాభై లక్షల ఎకరాల్లో సాగుచేయడమే మన లక్ష్యమన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసిందని..ఇది ఆశామాషీ వ్యవహారం కాదని పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మంత్రి ఈటల రాజేందర్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa