టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన నెట్‌వర్క్ వాడకందారులను పెంచుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తోంది. మార్కెట్‌లో దూసుకువెళ్లేందుకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ ఆఫర్లు ప్రీపెయిడ్ వాడకందారులకు అమలులో ఉంటాయి. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.2,200 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఇందుకోసం రిలయన్స్ జియో 22 కంపెనీలతో జత కట్టింది. వాటిలో శ్యాంసంగ్, షామీ, నోకియా, ఇంటెక్స్, హువాయి, బ్లాక్‌బెర్రీ, జియో ఎల్‌వైఎఫ్, మోటోరోలా, మైక్రోమ్యాక్స్, 10ఆర్, ఆసస్, పానాసోనిక్, ఎల్‌జి, అల్కాటెల్, కోమియో, జివి, సెల్‌కాన్, స్వైప్, జియోక్స్, చెన్, ఐవుమి, సెంట్రిక్ కంపెనీలకు చెందిన బ్రాండ్లు ఉన్నాయి.
ఈ కంపెనీల ఫోన్లను కొని మార్చి 31లోగా జియో సిమ్‌తో రీచార్జి చేయించుకోవాలి. వెంటనే రూ.50 విలువగల 44 క్యాష్‌బ్యాక్ ఓచర్లు కస్టమర్ మైజియో యాప్‌లో ఉంచుతుంది. ప్రతిసారి రూ.198 లేదా రూ.299కి పైగా రీచార్జి చేయించుకునే వినియోగదారుడు క్యాష్‌బ్యాక్ ఓచర్ల ద్వారా రాయితీపొందే వీలు కల్పించింది. 2022 మే 31 వరకు ఈ ఓచర్లు చెల్లుబాటు అవుతాయి. జియో మొదటిసారిగా జివి మొబైల్స్ సంస్థతో పెట్టుకున్న ఒప్పందంతో రూ.2,899 విలువైన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలుచేసి రూ.2,200 ఫుట్‌బాల్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే రూ.699కే ఫోను సొంతం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa