ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యం : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 02:22 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌదరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ-గవర్నెన్స్ ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ-గవర్నెన్స్‌తో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు. పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పౌరసేవల కోసం ఆర్టీఏ ఎం వ్యాలెట్ అందుబాటులోకి తీసుకువచ్చాం.. కొద్ది రోజుల్లోనే 1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa