ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సా.5గంటలకు ముంబై చేరుకోనున్న శ్రీదేవి పార్థివ దేహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 02:07 PM

శ్రీదేవి భౌతిక కాయం తరలింపుకు దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. శ్రీదేవి భౌతికకాయానికి పరీక్షలు నిర్వహించారు. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. వైద్యుల రిపోర్టు అనంతరం ఎన్‌వోసీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దుబాయ్‌ నుంచి శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా అనిల్ అంబానికి చెందిన ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశారు. శ్రీదేవి పార్థివ దేహం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముంబై చేరుకోనుందని తెలియవచ్చింది.


 అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి పార్థివదేహాన్ని మెహబూబ్‌ స్టూడియోలో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ముంబై అంధేరిలోని శ్రీదేవి నివాసానికి అభిమానులు భారీగా ముంబైకి తరలివస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖులు కూడా ముంబై బయలుదేరి వెళ్లారు. జుహాలోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. దుబాయ్‌లో బంధువుల ఇంట పెళ్లికి వెళ్లిన శ్రీదేవి.. శనివారం రాత్రి కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా హోటల్లోని బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆమెను స్థానిక షేక్‌ రాషేద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa