హైదరాబాద్: బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం కళ్యాణలక్ష్మి పథకానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరాలు ప్రకటించారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పేదింటి ఆడపడుచుల పెళ్లికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేళపెట్టింది. మొదట్లో కేవలం ఎస్సీ, ఎస్టీవారికే ఈ పథకాన్ని అమలు చేసినా తర్వాత బీసీలను కూడా ఇందులో చేర్చారు. ఇక ముస్లిం యువతుల కోసం షాదీ ముబారక్ పేరుతో ఇంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa