ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోలీ పండుగ సందర్భంగా జంతువులపై సన్నీ ట్విట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 02:25 PM

సన్నీలియోన్ హోలీ పండుగ సందర్భంగా జంతువుల గురించి ఆలోచన చేస్తోంది. అంతా సంతోషంగా హోలీ చేసుకోవడం ఓకే కానీ కొంతమంది ఇంట్లోనూ, వీధుల్లోనూ వుండే కుక్కలపై హోలీ రంగులు పోసి వాటిని గాయపరుస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దయచేసి కుక్కలపై రంగులు వేయొద్దండీ అంటూ పెటా విడుదల చేసిన ఓ ఫోటోను ట్వీట్ చేసింది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి ఈమధ్య రాంగోపాల్ వర్మ మహిళాదినోత్సవం సందర్భంగా ఆమెను ఉదహరిస్తూ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు మరికాస్త ప్రజాదరణ ఆ రకంగా వచ్చిపడింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa