హైదరాబాద్: నగరంలోని మొగల్‌పురా డివిజన్‌లో పోలీసలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంతోష్‌నగర్, లాల్‌దర్వాజా, ఛత్రినాక, మొఘల్‌పురాలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేని 150 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. 30 మంది రౌడీషీటర్లు, సరైన గుర్తింపు కార్డులు లేని 26 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న, అనధికారికంగా గ్యాస్ ఫిల్లింగ్‌స్టేషన్ నిర్వహిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa