ఛత్తీస్‌గఢ్ : బస్తర్ జిల్లాలోని జగదల్‌పూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనుల కోసం వినియోగిస్తున్న 9 ట్రాక్టర్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. అక్కడున్న జేసీబీ డ్రైవర్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి చేరుకొని మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa