ముంబై : మహారాష్ట్రలోని సోలాపూర్ - తుల్జాపూర్ రోడ్డుపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు వాహనాలు అదుపుతప్పి.. ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa