చెన్నై: లెజండరీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై నిమిషానికో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో అటు కోట్లాది మంది అభిమానులకు.. ఇటు నటీనటులకు పెద్దఎత్తున అనుమానాలు వస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీదేవిని హత్య చేశారని సంచలన ఆరోపణ చేశారు. ఆ రోజు రాత్రి హోటల్ గదికి ఎవరు వెళ్లారో బయటపెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఎందుకు ఇవ్వడంలేదని ఆయన సూటి ప్రశ్న సంధించారు. శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదని సుబ్రహ్మణ్యస్వామి తేల్చిచెప్పేశారు. అయితే ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని ప్రశ్నించారు. శ్రీదేవితో బలవంతంగా తాగించారా అన్నది తేల్చాలన్నారు.
సినిమా తారలతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరపాలన్నారు. అయితే ఆయన దావూద్ పేరు ప్రస్తావనకు తీసుకురావడంతో ఇప్పడి వరకూ అనుమానాలకు ఇదొకటి తోడైంది. దీంతో అసలు నిజాలేంటో.. ఆమె ఎలా చనిపోయారో అనేది తెలియక కోట్లాది అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa