ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మైదానంలో బౌలర్లపై ఏ విధంగా కనికరం లేకుండా చెలరేగుతాడో మనందరికీ తెలుసు. అతనికి వన్యప్రాణి జంతువులంటే మాత్రం అమితమైన ప్రేమ. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ నుంచి ఒక చిన్న చిరుత పిల్లను దత్తతు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులోనే ఆనందం ఉంది. చిన్న చిరుత పిల్ల ఎంత అందంగా ఉందో చూడండి? అంటూ ట్వీట్ చేస్తూ.. పాల డబ్బాతో ఆ పిల్లకు పాలను తాగిస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు పీటర్సన్. భారత్‌లో వేటగాళ్ల చేతిలో వన్యప్రాణులు బలవుతున్నాయని నా వంతు సాయం చేస్తానని పీటర్సన్ వారం క్రితమే స్పందించిన విషయం తెలిసిందే. జింక పిల్లతో చిరుత పిల్ల సరదాగా ఆడుకుంటున్న వీడియోనూ కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పీటర్సన్ నిర్ణయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో చాలా సార్లు వన్యప్రాణులను సంరక్షించాలని సామాజిక కార్యకర్తగా ప్రచారం కూడా చేశాడు.
#WATCH Former England cricketer Kevin Pietersen visited Jungle Safari in Naya Raipur; fed milk to a leopard cub #Chhattisgarh pic.twitter.com/egTIscz9cV
— ANI (@ANI) February 26, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa