ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్‌కు పెద్దపల్లి జిల్లాలో ఘన స్వాగతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 12:51 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్దపల్లి జిల్లాలో ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు అంతర్గాం మండలానికి వచ్చిన ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన, కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌తోపాటు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ధనిక జిల్లాగా మారుతుందని పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరులో రూ.80కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాలు, భారీ పరిశ్రమలు ఉన్న పెద్దపల్లి జిల్లా భవిష్యత్‌లో ఆదర్శ జిల్లాగా మారుతుందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే 22వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, రైతాంగానికి సాగు, తాగునీరుకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని జైనథ్‌ మండలంలో చనాకా-కొరాటా బ్యారేజీ పనులను పరిశీలించారు. జూన్‌ నాటికి 10 వేల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ చనాక-కొరాట బ్యారేజ్‌ను 265.55 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మిస్తున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ఫిలీగ్రీం బహుకరించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్‌కు వచ్చిన ముఖ్యమంత్రికి కలెక్టర్‌ జిల్లా పక్షాన జ్ఞాపిక అందించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa