ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఓ టెక్కీ పనిమనిషితో ఎఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 12:53 PM

హైదరాబాద్‌లో ఓ టెక్కీ చేసిన పని సంచలనంగా మారింది. తన ఇంట్లో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని... వారిద్దరు ఏకాంతంగా గడుపుతున్న వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అతడిలోని వికృత రూపాన్ని కూడా బయటపెట్టాయి. నగరానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. అయితే రోజూ ఇంట్లో పనిచేసేందుకు ఓ మహిళను నియమించుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని నాగేశ్వరరావు... పనిమనిషితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కెమెరాతో రికార్డు చేశాడు.


రికార్డు చేసిన వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు నాగేశ్వరరావు ఆ వెబ్‌సైట్‌కు ప్రీమియమ్ మెంబర్ కూడానట. ఇలా వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా డబ్బు ఇచ్చేవాళ్లు. ఇలా తరచూ పోస్ట్ చేసేవాడు. అయితే ఒకరోజు ఈ వీడియోను బాధితురాలి కుమారుడి ఫ్రెండ్ చూశాడు. జరిగిన విషయాన్ని అతడికి చెప్పడంతో... వాళ్ల అమ్మకు చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa