న్యూఢిల్లి : కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు. పోచారంతోపాటు ఎంపి బిబి పాటిల్ కూడా ఉన్నారు. నిజామాబాద్ – కామారెడ్డిలలో రాష్ట్రప్రభుత్వం కొత్తగా చేపట్టిన గురుకుల పాఠశాలలకు మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించాలని నఖ్వికి పోచారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పోచారం వివరించారు. మైనారిటీల విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని నఖ్వీ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa