ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైట్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 02:14 PM

ఆదిలాబాద్‌: చనకా-కొరాట బ్యారేజ్‌ను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ చేరుకున్నారు. ఆదిలాబాద్‌ డైట్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభకు మంత్రులు ఈటల రాజేందర్‌, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి , ఎంపీలు, కేశవరావు, నగేశ్‌, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో జిల్లాకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. సాత్నాల ప్రాజెక్టుకు రూ.28కోట్లు మంజూరు చేశామని అన్నారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెరువుల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. చెరువుల ద్వారా దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోందన్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అన్నారు. ప్రాజెక్టు ద్వారా 6 నెలల్లో 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బోథ్‌ నియోజకవర్గంలో రూ.210 కోట్లతో గోముత్రి రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. కడెం ప్రాజెక్టుకు రూ.870 కోట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆదిలాబాద్‌లో మినీ ఏరో డ్రమ్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa