ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి రూ.85 కోట్లు: సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 02:42 PM

ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి రూ.85 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆదిలాబాద్‌ డైట్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఆదిలాబాద్‌లో టౌన్‌హాలు నిర్మాణం చేపట్టాలన్నారు. ఆదిలాబాద్‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నామన్నారు. దళిత సోదరుల అభివృద్ధి కోసం రూ.7 కోట్లు, ముస్లిం సోదరుల కోసం రూ.17కోట్లు విడుదల చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.75 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఆదిలాబాద్‌కు అదనంగా వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. కాళేశ్వరం ద్వారా ముథోల్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకుసాగునీరు అందుతుందన్నారు. ప్రజల సౌకర్యం కోసం 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని, భేదాభిప్రాయాలతో మనకే నష్టం అన్నారు. బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి పెరిగే వరకు పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 500 గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఒక్కో విద్యార్థి మీద రూ.1.10 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదేనని అన్నారు. వంద రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. రైతులకు ఏడాదికి రూ.8వేలు పెట్టుబడి రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ కోసం రూ.12వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa