హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే.. మద్దతు ధర కల్పించకుండా ఆ నెపం కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్.. కేంద్రంతో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన ఉద్యమ ద్రోహి అయిన టీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa