ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా సంకీర్ణదళాల దాడుల్లో25 మంది సిరియా పౌరులు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 03:18 PM

బీరూట్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర వాదులకు పట్టున్న ఆఖరు గ్రామం అల్ షాఫా గ్రామంపై అమెరికా సంకీర్ణదళాలు విరుచుకుపడ్డాయి. ఆదివారం జరిగిన వాయుసేనల దాడుల్లో 25 మంది పౌరులు మరణించారు. సరిహద్దులోని ఐఎస్ నేత అల్బు కమల్ కంచుకోట అల్-షాఫా గ్రామంపై బాంబుల వర్షం కురిసిందని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల పరిశీలకుడు రామి అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఆదివారం రోజంతా సాగిన బాంబు దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 25 మంది పౌరులు చనిపోయారు. ఈ గ్రామం సిరియాలో ఐఎస్‌కు పట్టున్న చిట్టచివరిది అని ఆయన తెలిపారు. యూఫరేట్స్ నదికి ఆవల కుర్దిష్ సేనలతో కలిసి అమెరికా సంకీర్ణదళాలు నదికి పశ్చిమాన రష్యా నేతృత్వంలోని దళాలు దాడులు జరుపుతున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa