వచ్చే నెల సొంతగడ్డపై ఆసీస్‌తో తలపడే భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కెప్టెన్, వైస్‌కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వడోదర వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.సఫారీ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్‌తో పోరుకు సిద్ధమౌతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన స్టార్ బౌలర్ జులన్ గోస్వామి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైంది.
జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్) స్మృతి మంధాన, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, రోడ్రిక్స్, మోనా మిశ్రం, సుష్మా వర్మ(వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, సుకన్య పరిద, పూజ, దీప్తి శర్మ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa