హైదరాబాద్: హైదర్‌గూడలో శాసనసభ్యుల కాలనీలోని బహుళ అంతస్తుల భవనాలను మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రోడ్లు భవనాలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.166 కోట్ల అంచనా వ్యయంతో మూడెకరాల స్థలంలో ఒక్కొక్కటి 2,500 చదరపు అడుగుల వైశాల్యంతో 120 క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్‌పూల్, సిబ్బంది క్వార్టర్లు, వాణిజ్య సముదాయం వంటి ఆధునిక హంగులను సమకూర్చుతున్నారు. 12 అంతస్తుల్లో 120 ప్లాట్లు నిర్మిస్తున్నారు. రెండు సెల్లార్లలో 288 కార్లను పార్కింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 24 కార్యాలయ క్యాబిన్లు నిర్మిస్తున్నారు. 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. ఆరు అంతస్తుల్లో ఉద్యోగుల నివాసం కోసం 36 ఫ్లాట్లు నిర్మిస్తుండగా, సిబ్బంది నివాసాలను సైతం ఆరు అంతస్తుల్లో చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa