చెన్నై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అరెస్టయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈరోజు ఉదయం లండన్ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. ఆయన్ని దిల్లీకి తరలించనున్నట్లు సమాచారం.
ఐఎన్‌ఎక్స్ మీడియా అంశంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని కార్తిపై ఆరోపణలు ఉన్నాయి. 2007లో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో కార్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు సహకరించడంలేదని కార్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్‌ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో మంగళవారం కార్తికి చెందిన సీఏ ఎస్. భాస్కరరామన్‌కు దిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa