ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదర్‌గూడ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 10:02 AM

హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ వాసులు కొందరు కిందకు దిగగా మరికొందరు భవనం టెర్రస్‌పైకి వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పింది. భవనంపైన ఉన్న వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 2 ఎరువులు, విత్తనాల దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa