ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 10:08 AM

హైదరాబాద్: నగరంలోని పేట్లబురుజు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నేడు జరిగింది. శిక్షణ పూర్తిచేసుకున్న మొత్తం 365 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది హాజరై కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, అదనపు సీపీ శివప్రసాద్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. పేట్లబురుజు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో 288 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందగా.. సంగారెడ్డి డీటీసీలో 67 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు విజయవంతంగా శిక్షణను పూర్తిచేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa