హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా అధికారుల నిమిషం నిబంధన యథావిధిగానే పలువురు విద్యార్థులకు శరాగతంగా మారింది. పరీక్షకు హాజరుకాకుండానే వెనుతిరిగారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముగ్గురు విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి, కొత్తగూడెంలో మరో విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో బాధిత విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమౌతూ వెనుతిరిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa