2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..టిఆర్‌ఎస్‌కు 106 సీట్లు రాకపోతే కేసీఆర్ రాజకీయాల ను వదిలేస్తారా ? అని టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కేసీఆర్ ఏమీ చేయలేకనే గత పాలకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలకు బంగారు తెలంగాణ పేరు చెప్పి మభ్యపెట్టి బంగారు కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతు సమన్వయ సమితులన్నీ టిఆర్‌ఎస్ కమిటీల కిం దికే వస్తాయని, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పడం కూడా టిఆర్‌ఎస్ ప్లానేనన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa