వడ్డీ రేట్లు తక్కువ అవుతున్నాయని నిరాశ చెందుతున్న ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంకు శుభవార్త చెప్పిది. దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రిటైల్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేసింది.తాజా మార్పులతో 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగింది. వార్షిక వడ్డీ రేటు 6.40శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 6.25శాతంగా ఉండేది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉండే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. ఇప్పటివరకూ ఇది 6శాతం. అలాగే రూ. 1కోటి పైన డిపాజిట్లపై కూడా ఈ పెంపు వర్తింప చేయనుంది.సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై ఇకపై 7శాతం వడ్డీ అమలు కానుంది. అంతకు ముందు ఇది 6.50 శాతంగా ఉంది. ఈ సవరించిన వడ్డీరేట్లు నూతనంగా చేసే డిపాజిట్లకు , రెన్యువల్ చేసుకునే డిపాజిట్లకు కూడా వర్తిస్తాయని ఎస్‌బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లను కూడా త్వరలోనే భారీగా పెంచనుందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన పాలసీ రేట్లను వరుసగా మూడోసారి సైతం యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
అయితే రుణాలపై తగ్గించిన వడ్డీ రేట్లను ప్రజలకు అందేలా చూడాలని రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకులను కోరింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ విధంగా స్పందించవలసి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa